రైతు బంధు పధకం అప్లై చేయటకు చివరి తేది

 

సాగు కోసం రైతులు పడుతున్న కష్టాలు చూసి రైతు బంధు పధకం ప్రవేశ పెట్టారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. చాల మందికి రైతు బంధు పధకం అందటం లేదు. ఎందుకంటే వారి బ్యాంకు అకౌంట్ మరియు ఇతర వివరాలు సరిగా లేనందు వలన ఈ  సమస్యలు వస్తున్నాయి. 

 

కొన్ని సార్లు వ్యవసాయ శాఖ అధికారులకు చెప్పిన ఈ సమస్యలు అంతగా పరిష్కారం అవటల్లేదు. అందుకనే తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పధకం సమస్యలను పిర్యాదు చేసుకోవటాని గ్రీవెన్సు సెల్ ని ఏర్పాటు చేసారు. మీకు ఏమని సమస్యలు ఉంటే, అవి పరిష్కారం కాకపోతే ఈ పేజీ లో వున్నా వారిని సంప్రదించండి. 

 

56,94,185 మంది రైతులకి  ఇప్పటి వరకు 7,18,367 కోట్లు జమ చేసారు అని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది.  జులై 5వ తేది లోపు బ్యాంకు వివరాలు తప్పు వున్నా వాళ్ళు, వాళ్ళ సరి అయినా వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.  తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద  34,860 మంది రైతులు బ్యాంకు కాథాలు సరిగా లేనందు వల్ల, వారికి రైతు బంధు పధకం కింద డబ్బులు రాలేదు అని తెలిసింది. 

 

రైతు బంధు పధకానికి సరి చూసు కోవాల్సిని డాకుమెంట్స్ :

  1. పట్టాదారు పాస్ పుస్తకాలు, వాటి నంబర్స్ సరిగా రాసి అప్లై చేసుకోవాలి 
  2. బ్యాంకు ఖాతా  నెంబర్ సరిగా రాయాలి 
  3. ఆధార్ కార్డు నెంబర్ సరిగా అప్లికేషన్ లో ఇవ్వాలి 
  4. బ్యాంకు IFSC  కోడ్ సరిగా ఇవ్వాలి 

 

ఇలాంటి తప్పులు వున్నా వాళ్ళు సుమారు 5 లక్షల  మంది వున్నారు. 34,860 మంది కి బ్యాంకు నుండి డబ్బులు బదిలీ చేస్తే వారికి బ్యాంకు అకౌంట్ నెంబర్ సరిగా లేకపోతే వారికీ డబ్బులు తిరిగి బ్యాంకు కు వచేసాయి. రైతు బంధు పధకం కోసం అప్లై చేసి, డబ్బులు రాని వాళ్ళు తమ తమ బ్యాంకు కార్యాలయానికి వెళ్లి మీ వివరాలను సరిచూసుకోండి. మర్చిపోవద్దు ఇవాళ జులై 5, మీకు చివరి రోజు.